ఐపీఎల్ 2022: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర
- June 12, 2022
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ (IPL) టీవీ, డిజిటల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ జరుగుతుంది.ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది. దీంతో బడా కంపెనీలన్నీ టెలికాస్ట్ రైట్స్ కోసం పోటీపడుతుననాయి. ముగిసింది.
ఇక 2023-2027 వరకు బ్రాడ్కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ జరుగుతుండగా.. తొలిసారిగా బీసీసీఐ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఫలితంగా టీవీ బ్రాడ్కాస్టింగ్ హక్కులు సుమారు రూ.22వేల 500 కోట్లు చేరినట్లు సమాచారం. అదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విలువ రూ.19 వేల కోట్లకు చేరిందట.
ఈ వేలాన్ని పరిశీలిస్తున్న నిపుణులు హక్కుల రేట్లు మరింత పెరుగునున్నట్లు భావిస్తున్నారు. డిజిటల్ హక్కులు రూ.22 వేల కోట్ల వరకు పలుకుతాయని, టీవీ హక్కులు సుమారు రూ.25 వేల కోట్లకు చేరతాయని అంటున్నారు. ప్రస్తుతం జరిగే హడావిడి మొత్తం భారత ఉపఖండంలో స్ట్రీమింగ్, బ్రాడ్కాస్టింగ్ చేసుకునేందుకు మాత్రమే కావడం గమనార్హం.
ఈ లెక్కన ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ టెలికాస్టింగ్ వాల్యూ రూ.100 కోట్లు దాటిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇది 2018-2022 మధ్య రూ.55 కోట్లుగా ఉండేది.
తాజా వార్తలు
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..







