సాయి ధరమ్ తేజ కొత్త సినిమా లుక్..అదిరిపోయే స్టోరీ లైన్ తో...

- June 13, 2022 , by Maagulf
సాయి ధరమ్ తేజ కొత్త సినిమా లుక్..అదిరిపోయే స్టోరీ లైన్ తో...

సాయి ధరమ్ తేజ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాల్లో డాన్స్ లు, పాటలు, ఫైట్స్ వీటికి ప్రయారిటి ఎక్కువ ఇస్తూంటారు. మాస్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు. అయితే చిత్ర లహరి చిత్రం నుంచి ఆయన మైండ్ సెట్ మారింది. కథల్లో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అందుకు సంభందించిన మేకింగ్ పోస్టర్ ఇదిగో ఇక్కడ చూడండి. 

సాధారణంగా చేతబడి,బాణామతి,బ్లాక్ మ్యాజిక్ వంటి నేఫధ్యాలు ఉన్న కథలతో వచ్చే చిత్రాలలో హీరోలకు పెద్ద ప్రయారిటీ ఉండదు. ఏదో చిన్న హీరో అనుకుని హారర్ ఎలిమెంట్స్ ని పెట్టుకుని లాగేస్తూంటారు. అయితే ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ఇలాంటి కథలకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ మధ్యన సిద్దార్ద్ ఇలాంటి కథతో సినిమా చేసారు. ఆ తర్వాత రానా సైతం ఇలాంటి కథ కమిటయ్యారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ కూడా ఈ నేఫధ్యంలో కథను ఎంచుకుని ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్  గత సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.   బ్రేక్ తీసుకున్న ఈ మెగా హీరో రెట్టింపు ఉత్సాహంతో కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తేజ్ కెరీర్‌లో 15వది కావడం విశేషం.   తాజా సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించిన కథా నేపథ్యం గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి 'భమ్ బోలేనాథ్'   ఫేమ్ కార్తీక్ వర్మ దండు  దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరక్టర్ సుకుమార్  ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటుగా.. కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఈ సినిమా మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

చేతబడి ( బ్లాక్ మ్యాజిక్) నేపథ్యంలో కథ, కథనాలు సాగుతాయని సమాచారం. చేతబడికి బలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామానికి, ముంబై నుంచి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా ఛేదిస్తాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనే ఇతివృత్తంతో ఈ  కథ..నడుస్తుందని అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే డిఫరెంట్ జోనర్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న సినిమా అని చిత్ర టీమ్  హింట్ ఇచ్చింది. సుకుమార్ వంటి స్టార్ డైరక్టర్  అందిస్తున్న కథతో తేజ్ మొదటిసారి ఇలాంటి జోనర్‌లో సినిమా చేస్తుండటం ఆసక్తికరం అని చెప్పాలి. 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై  సుకుమార్ రైటింగ్స్‌ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు 'రిపబ్లిక్' డిజాస్టర్ కాగా, 'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com