'బ్రహ్మస్త్రం' సినిమాకి వాయిస్ ఓవర్ అందిస్తున్న మెగాస్టార్ చీరంజీవి..
- June 13, 2022
MEGASTAR CHIRANJEEVI Voices Telugu Version of Brahmāstra Part One: Shiva Trailer!
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర'. తెలుగులో ఈ సినిమా 'బ్రహ్మస్త్రం' పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో ముందడుగు వేసి బ్రహ్మస్త్రం సినిమాకి వాయిస్ ఓవర్ అందించనున్నారు. "ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు అతనే శివ" అని మెగాస్టార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే ట్రైలర్ జూన్ 15న 5 భాషల్లో విడుదలకానుంది.
ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా మేకర్స్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







