150 మంది అనాధల్లో ఆనందాన్ని నింపిన ఎటిసలాట్
- April 09, 2016
ఎటిసలాట్ సంస్థ 150 మంది చిన్నారుల్లో ఆనందాన్ని నింపింది. అనాధల్లో ఆనందాన్ని నింపేందుకు గత మూడేళ్ళుగా పలు కార్యక్రమాలను చేపడుతున్న ఎటిసలాట్, ఈసారి కూడా అదే విధంగా ఓ ఛారిటీ కార్యక్రమం నిర్వహించింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 'డిస్నీ లైవ్ మిక్కీ మ్యూజిక్ ఫెస్టివల్'కి హాజరయ్యేందుకు 150 మంది అనాధలకు అవకాశం కల్పించింది ఎటిసలాట్ సంస్థ. ఈ సందర్భంగా వారంతా, 25 డిస్నీ క్యారెక్టర్స్ ఇచ్చిన లైవ్ పెర్ఫామెన్సెస్‌ని తిలకించారు. తమ అభిమాన క్యారెక్టర్లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అలాగే మంచి విందు కూడా ఇక్కడ వారికి ఏర్పాటు చేయడం జరిగింది. యూఏఈ నుంచి అల్ ఇషాన్ ఛారిటీ అసోసియేషన్, సార్జా ఛారిటీ ఇంటర్నేషనల్, దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ మరియు రాయాటి ఫ్యామిలీ సొసైటీ తదితర సంస్థలు ఈ షోకి ఆహ్వానింపబడ్డాయి. పిల్లల్లో ఆనందం చూస్తోంటే చాలా సంతోషం కలిగిందనీ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలనుకుంటున్నామని విపి కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఫేర్స్ హమాద్ ఫేర్స్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







