సూర్య ప్రతాప్ పై శర్వానంద్ కన్ను...
- April 09, 2016
యువ హీరోలు మంచి కథలకోసం చూసే రోజులివి. మామూలుగా ఒక రేంజ్ వచ్చే వరకు మంచి సినిమాలు చేయాలనే తపన వారిలో సహజంగానే ఉంటుంది. రేంజ్ వచ్చిన తర్వాత కూడా గుడ్ మూవీస్ చేయాలనే కోరిక ఉంటుంది. మంచి కథ ఉన్నంత మాత్రాన సరిపోదు. మంచి డైరెక్టర్ కూడా ఉండాలి. ఈ రెండూ ఉంటేనే హీరో హిట్స్ కొడతాడు. ప్రస్తుతం యువ హీరో శర్వానంద్ కూడా ఆ రూట్ లోనే వెడుతున్నాడు. గతం మాటేమో కానీ శర్వానంద్ ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా అయిపోయాడు. ఈ మూవీతో పాటు... శర్వా యాక్ట్ చేసిన రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు కూడా సక్సెస్ కావడం అతనికి కలిసొచ్చింది. అంతమాత్రాన శర్వానంద్ సంబరపడిపోలేదు. ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత ఈ యువ హీరో మూడు నాలుగు నెలలు మరే పిక్చర్ కూ కమిట్ కాలేదు. తొందరపడి ఏ సినిమా అంటే ఆ సినిమా కూడా ఒప్పుకోవడం లేదు.విజయాలు తెచ్చిన ఇమేజ్ ను నిలబెట్టుకోవాలని శర్వానంద్ ఆరాటపడుతున్నాడు. అందుకే జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. తనకు సరిపడిన మంచి కథ, మంచి డైరెక్టర్ కోసం ట్రై చేస్తున్నాడు. అతని లుక్ కుమార్ 21 ఎఫ్ డైరెక్టర్ పై పడింది. ఆ మూవీ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్. అతనితో మూవీ చేస్తే తన కెరీర్ టర్న్ అవుతుందనుకున్నాడు శర్వానంద్. సూర్యప్రతాప్ కొత్త డైరెక్టర్ అయినా కుమారి 21 ఎఫ్ మంచి హిట్ ఇచ్చాడు.ఇటు శర్వానంద్ మాత్రమే కాదు, అటు సూర్య ప్రతాప్ కూడా మరో హిట్ కోసం చూస్తున్నాడు. అంటే ఇద్దరూ ఈక్వెల్ లెవెల్ లోనే ఉన్నారని తెలుస్తుంది. సూర్య ప్రతాప్ చెప్పిన లైన్ శర్వానంద్ కు నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టోరీని డెవలప్ చేయమని కూడా శర్వానంద్ చెప్పాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తి చేసుకుని అతి త్వరలో షూటింగ్ కు వెళ్లాలని శర్వానంద్, సూర్య ప్రతాప్ ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







