ఫిఫా ప్రపంచకప్.. 7 మిలియన్లకు పైగా ప్రయాణీకులు
- June 14, 2022
దోహా: ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో నవంబర్-డిసెంబర్ 2022 నెలల్లో ఖతార్ విమానాశ్రయాలలో రాకపోకలు, నిష్క్రమణలు, రవాణాతో సహా ప్రయాణీకుల సంఖ్య 7 మిలియన్లకు పైగా ఉంటుందని ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (క్యూసిఎఎ) అంచనా వేసింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే FIFA ప్రపంచ కప్ సందర్భంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA), దోహా అంతర్జాతీయ విమానాశ్రయం రెండింటిలోనూ ప్రయాణీకుల విమానాల సంఖ్య సుమారు 28 వేలకు చేరుకుంటుందని అంచనా. ప్రయాణీకుల ట్రాఫిక్ అంచనాలు 2021 సంవత్సరంతో పోలిస్తే +90% నుండి +105% వరకు వృద్ధి చెందిందని, సంవత్సరంలో మొత్తం ప్రయాణీకుల సంఖ్యను సుమారు 34 మిలియన్లకు దాటే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







