‘విరాట పర్వం’ బాధ్యత అంతా సాయి పల్లవిపైనేనా.?

- June 14, 2022 , by Maagulf
‘విరాట పర్వం’ బాధ్యత అంతా సాయి పల్లవిపైనేనా.?

లేడీ పవర్ స్టార్‌గా ప్రస్తుతం సాయి పల్లవి కీర్తించబడుతోంది. సినిమా ఫంక్షన్లలో ఆమె కనిపిస్తే ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌కి ఫిలిం మేకర్లంతా ఆశ్చర్యపోతున్నారు. నిజమే, సాయి పల్లవి ఆ అభిమానానికి అర్హురాలే. ఆమె ఏ సినిమాకి పని చేసినా, డెడికేషన్‌తో పని చేస్తుంది.

అంతకు ముందు ఏ సినిమా తీసుకున్నా, రీసెంట్‌గా వచ్చిన ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమా వరకూ సాయి పల్లవి గ్రాఫ్ పై పైకి ఎదుగుతూనే వుంది. ‘శ్యామ్ సింఘరాయ్’ తర్వాత సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చేమో.
 
ఇక ఇప్పుడు.. ‘విరాటపర్వం’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. యదార్ధ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు.రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది. కానీ, కరోనా ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లు వేగవంతం చేశారు. సాయి పల్లవి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతుండడం విశేషం. మొదట్లో అంతంత మాత్రంగా స్టార్ట్ అయిన ఈ సినిమా హంగామా, ప్రమోషన్లలో సాయి పల్లవి ఎంట్రీతో సరికొత్త టర్న్ తీసుకుంది.

సాయి పల్లవి వుంటే, ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్టే.. అనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో గట్టిగా బలపడిపోయింది. అదే ఫార్ములా ‘విరాట పర్వం’ విషయంలోనూ వర్కవుట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రమోషన్లలో భాగంగా సాయి పల్లవి చేస్తున్న సందడి అయతే అంతా ఇంతా కాదు, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా గడుపుతోంది. సినిమాకి మించిన క్రేజ్ వస్తోంది సాయి పల్లవి ఇంటర్వ్యూలకు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com