భారత్ కరోనా అప్డేట్
- June 15, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గినట్టేతగ్గి మళ్లీ పెరిగాయి. మంగళవారం 6594 కేసులు నమోదవగా, ఇప్పుడు ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు బలవగా, 5718 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 2956 మందికి పాజిటివ్ రాగా, కేరళలో 1989, ఢిల్లీలో 1118, కర్ణాటకలో 594, హర్యానాలో 430 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతానికి చేరింది. రికవరీ రేటు 98.66 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ 2 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 1,95,50,87,271 మందికి కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం