కువైట్ లోని భారతీయులపై ప్రశంసల వర్షం..
- June 15, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ఆ దేశంలోని ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులను హీరోలుగా అభివర్ణించారు.ఎన్నారైలు చేస్తున్న సేవను కొనియాడారు.
జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్‌తో కలిసి రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన సిబి జార్జ్ మాట్లాడారు.కువైట్ లో ఉన్న రక్తదాతల్లో అత్యధికులు భారతీయ పౌరులే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న భారతీయులను ఆయన హీరోలుగా అభివర్ణించారు.అంతేకాకుండా భారతీయుల సేవను కువైట్ అధికారులు కూడా గుర్తించి, ప్రశంసించినట్టు చెప్పారు.రక్తదానం గురించి భారతీయుల్లో అవగాహన పెంచి, ప్రోత్సహిస్తున్న ఇండియన్ కమ్యూనిటీలను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం