సాయి పల్లవి ఏడ్సేస్తుంది ఎందుకు.?

- June 15, 2022 , by Maagulf
సాయి పల్లవి ఏడ్సేస్తుంది ఎందుకు.?

అభిమానులతో ఎక్కువగా మాట్లాడితే చాలు.. సాయి పల్లవికి ఏడుపొచ్చేస్తుంది. అభిమానుల అభిమానాన్ని అస్సలు తట్టుకోలేదు. ఆ ఎమోషన్‌ని దాచుకోలేదు. కన్నీళ్లతో ఆ ఎక్స్‌ప్రెషన్‌ని బయటికి తెచ్చేస్తుంటుంది సాయి పల్లవి. అయితే, ఈ ఎమోషనే ఇప్పుడు సాయి పల్లవికి నెగిటివ్ అయిపోతోంది.

ఒక్కసారి ఏడిస్తే ఫర్వాలేదు. రెండు సార్లు ఏడిస్తే పర్వాలేదు. కానీ, పదే పదే అదే చేస్తుంటే, అదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందా.? అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు సాయి పల్లవిని. లేడీ పవర్ స్టార్ అనే పాపులారిటీ సంపాదించింది సాయి పల్లవి. నటనలో సినిమా సినిమాకీ మెచ్యూరిటీ చూపిస్తోంది.

అలాంటప్పుడు తన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవడంలోనూ ఆ మెచ్యూరిటీ వుండాలి కదా.. అని సాయి పల్లవికి కొందరు సలహాలిస్తున్నారు. నటిగా ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసింది సాయి పల్లవి. చాలా మందికి రోల్ మోడల్ ఆమె. అలాంటిది పబ్లిక్ ప్లేస్‌లో చిన్నపాటి ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోకపోతే ఎలా.? అంటున్నారు.

సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది. సహజంగా హీరోయిన్లు ప్రమోషన్లలో పాల్గొనడం చాలా కామన్. అందుకు అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్ అంతా నిర్మాతలదే. కానీ, సాయి పల్లవి మాత్రం డెడికేటెడ్ గా వుంటుంది ఆ విషయంలో.
నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టదు. తన మేకప్‌ కోసం, ఎక్కువ మంది అసిస్టెంట్లను ప్రిఫర్ చేయదు. ఒక్క పర్సనల్ అసిస్టెంట్‌ని మాత్రమే తన వెంట తెచ్చుకుంటుంది. ఇలా చాలా విషయాల్లో సాయి పల్లవి నిర్మాతలకు చాలా కంఫర్ట్. అందుకే హీరోయిన్లందరిలోనూ సాయి పల్లవి వెరీ వెరీ స్పెషల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com