సౌదీలకు కింగ్ ఫహాద్ కాజ్‌వే ట్రావెల్ విధానాల్ని అప్ డేట్ చేసిన సౌదీ

- June 15, 2022 , by Maagulf
సౌదీలకు కింగ్ ఫహాద్ కాజ్‌వే ట్రావెల్ విధానాల్ని అప్ డేట్ చేసిన సౌదీ

సౌదీ: కింగ్ ఫహాద్ కాజ్‌వే అథారిటీ, సౌదీ పౌరులు బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళడానికి సంబంధించిన విధి విదానాల్ని అప్‌డేట్ చేసింది. పెద్దవాళ్ళు ఈ కాజ్‌వే దాటాలంటే, మూడు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాల్సిి వుంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్, మూడో డోస్ బూస్టర్ కలిసి మొత్తంగా మూడు డోసులు పూర్తి చేసుకోవాలి. బూస్టర్ డోసుకి సంబంధించి గతంలో వున్న 8 నెలల సమయాన్ని 3 నెలలకు కుదించారు. 16 ఏళ్ళ లోపువారు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలి. 12 ఏళ్ళ లోపువారికి ఇన్స్యూరెన్స్ పాలసీ వుండాలి (కోవిడ్ వైరస్ సంబంధితమైనది). హిజ్రి తేదీ ప్రకారం వయసు నిర్ధారిస్తారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన ఇన్స్యూరెన్స్ పాలసీ మాత్రమే ఆమోదిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com