కొత్త కార్మికులకు వర్క్ పర్మిట్ బదిలీ నిలిపివేత!

- June 16, 2022 , by Maagulf
కొత్త కార్మికులకు వర్క్ పర్మిట్ బదిలీ నిలిపివేత!

కువైట్: విదేశాల నుండి కొత్తగా రిక్రూట్ అయిన కార్మికులకు వర్క్ పర్మిట్‌ల బదిలీని మూడేళ్ల వరకు నిలిపివేయడాన్ని పరిశీలిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) తెలిపింది. ఈ మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత  కార్మికుడు అదే వర్గానికి బదిలీ చేయడానికి అనుమతించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా 28 కంటే ఎక్కువ రంగాల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు అథారిటీ భావిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు లేదా వాటిలో కనీసం 25 శాతం సహకారం అందించడం, ఆసుపత్రులు, ఫార్మసీలు, వైద్య ప్రయోగశాలలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, పెట్టుబడి, బ్యాంకింగ్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, శిక్షణా సంస్థలు, నర్సరీలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, ప్రజా ప్రయోజన సంఘాలు, యూనియన్‌లు, సహకార సంఘాలు, ట్రేడ్ యూనియన్‌లు, ధార్మిక ఫౌండేషన్‌లు, ఛారిటబుల్ ఎండోమెంట్‌లు, పారిశ్రామిక సౌకర్యాలు, చిన్న పరిశ్రమలు, స్థానిక- విదేశీ విమానయాన సంస్థలు, ఎయిర్‌లైన్ -మెరైన్ ఏజెంట్లు, మీడియా స్టేషన్లు, వ్యవసాయ ప్లాంట్లు, చేపలు పట్టడం, గొర్రెలు-ఒంటెల పెంపకం, ప్రెస్ హౌస్‌లు, వాణిజ్య రియల్ ఎస్టేట్ ఇంజనీరింగ్, చట్టపరమైన ఆర్థిక సలహా కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com