విమాన టికెట్ ధరలు పెంచిన స్పైస్ జెట్
- June 16, 2022
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, గత కొన్ని నెలలుగా 110 డాలర్లకు పైనే ఉండడం విమానయాన సంస్థలను (ఎయిర్ లైన్స్) తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. దీంతో రేట్ల పెంపు పెంచినట్లు చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్ జెట్ పేర్కొంది.నిర్వహణ వ్యయం అధికమవడంతో టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.ఒకవైపు చమురు ధరలు పెరగడం, మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణించడాన్ని ఈ సంస్థ ప్రస్తావించింది.
డాలర్ తో రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే టికెట్ ధరలు పెంచామని అని జెట్ ఎయిర్వేస్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దీనివల్ల తమకు కొంతవరకు భారం తగ్గుతుందని చెప్పారు.2021 జూన్ 21 తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రెట్లు 120 శాతం అధికమయ్యాయని, ఇది మోయలేని భారంగా మారిందన్నారు. నిర్వహణ వ్యయంలో ఇదే 50 శాతం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







