గూగుల్ మ్యాప్‌లో 'టోల్ చార్జీ'ల ధర!
- June 16, 2022
న్యూ ఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాహనదారులకు అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వాహనదారులు టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఆ ప్రాంతానికి చేరుకోకముందే భారతదేశంలోని వినియోగదారులు ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లోని టోల్ ధరలను ముందే తెలుసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది.ఈ ఫీచర్ యూఎస్ఏ, ఇండియా సహా ఇండోనేషియాలోని దాదాపు 2,000 టోల్ రోడ్‌లకు అందుబాటులోకి వస్తుంది.
వాహనదారులు వెళ్లే రోడ్డులో టోల్ చార్జీల రూపేనా చెల్లించాల్సిన మొత్తం ధరను అంచనా వేసేందుకు గూగుల్ మ్యాప్స్ స్థానిక అధికారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఇక టోల్ ధరల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్‌లో ఆరిజిన్, డెస్టినేషన్ వివరాలను ఎంటర్ చేయాలి. దీంతో మీకు వెంటనే రోడ్డు మార్గానికి సంబంధించిన షార్ట్ కట్‌లతో పాటు ఎస్టిమేట్ టోల్ ధరలు డిస్‌ప్లే అవుతాయి. అంతేకాదు టోల్ చెల్లించకూడదనుకునే వారికి టోల్-ఫ్రీ మార్గంతో ప్రత్యామ్నాయ ఎంపికలను కూడా చూపుతుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో పైన రైట్ కార్నర్‌లో ఉన్న మూడు చుక్కలపై నొక్కి, 'అవాయిడ్ టోల్స్' అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఈ సమాచారం పొందొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







