‘అగ్నిపథ్‘ వ్యతిరేకంగా కదంతొక్కిన యువత..
- June 16, 2022
పాట్నా: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్'పథకం ఉత్తరభారత దేశంలో అగ్గిపెట్టింది.బీహార్,రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,హర్యానా, ఢిల్లీల్లో నిరుద్యోగులు అగ్నిపథ్ పథకంపై భగ్గుమున్నారు.
కేంద్రం ప్రకటించిన ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా యువత కదం తొక్కారు.నిరుద్యోగ యువత తీవ్ర నినసన గళం వినిపిస్తున్నారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు.ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంట్లో భాగంగా బిహార్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా సుమారు మూడు రెళ్లకు నిప్పు పెట్టారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చాప్రా, గోపాల్‌గంజ్, కైమూరు జిల్లాల్లో గురువారం (16,2022) యువకులు తీవ్రమైన ఆందోళనలు చేపట్టారు.రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. రోడ్లపై పుష్ అప్స్ చేస్తు నిరసనలు తెలిపారు. హర్యానాలు పలు వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు బీహార్ లో మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో నిరసనలు హోరెత్తాయి.నవాడా బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఆరా రైల్వే స్టేషన్ లో రైలు బోగీకి నిప్పు పెట్టారు.
రైల్వే పట్టాల మీద బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులను రైల్వే పట్టాల మీద నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని కైమూరు ఎస్పీ రాకేశ్ కుమార్ తెలిపారు. తమిళనాడులో కూడా సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులు నిరసనలకు దిగారు.వెల్లూరులో సుమారు 100 మంది యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు చేపట్టారు.కలెక్టరేట్‌ను చుట్టుముట్టాలని యువకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
బిహార్‌లో యువకుల ఆందోళనలు తీవ్రంగా మారాయి. అనేక రైల్వే స్టేషన్లలో నిరసనలు చేపట్టిన అభ్యర్థులు, మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. వెంటనే 'అగ్నిపథ్'ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 'అగ్నిపథ్' స్కీంలో భాగంగా నాలుగేళ్ల కాలానికి 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంటారు. వారిలో 25శాతం సైనికుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తారు. 'అగ్నివీరులు' అని పిలిచే వీరికి నెలకు రూ.30 నుంచి 40 వేల వరకు జీతం ఇస్తారు. ఈ ఏడాది 46 వేల మందిని నియమించుకోనున్నారు.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







