కొంతమంది ప్రయాణీకులకు హోం చెక్ ఇన్ సర్వీస్ ప్రకటించిన ఎమిరేట్స్

- June 16, 2022 , by Maagulf
కొంతమంది ప్రయాణీకులకు హోం చెక్ ఇన్ సర్వీస్ ప్రకటించిన ఎమిరేట్స్

యూఏఈ: ఇంటి వద్దనే కొందరు ప్రయాణీకులకు హోం చెక్ ఇన్ సర్వీస్ అందించేందుకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ముందుకొచ్చింది. దుబాయ్, షార్జాకి చెందిన ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు ఈ సర్వీస్ ఉచితం. చెక్ ఇన్ ఏజెంట్లు ప్రయాణీకుల ఇళ్ళను సందర్శించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సహా బ్యాగేజీ చెకింగ్ ఇన్, బోర్డింగ్ పాస్‌లు వంటి అంశాలపై సేవలు అందిస్తారు. చివరి నిమిషంలో అదనపు లగేజ్ వుంటే, దానికి సంబంధించి ప్రత్యేక కౌంటర్ కూడా వుంటుంది. వినియోగదారులు ప్రీ బుక్డ్ ఎమిరేట్స్ కాంప్లిమెంటరీ చాఫర్ డ్రైవ్ సర్వీసు ద్వారా వెళ్ళవచ్చు. ఏజెంట్లు లగేజ్ తీసుకుంటారు. కాంప్లిమెంటరీ హోమ్ చెక్ ఇన్ సర్వీస్ కనీసం 24 గంటల ముందుగా బుక్ చేసుకోవాలి. విమానం బయల్దేరడానికి 90 నిమిషాల ముందు విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి ప్రయాణీకులు చేరుకోవాలి. రిజిస్టర్డ్ వినియోగదారులు హ్యాండ్ ఫ్రీ విధానంలో ఇంటిగ్రేటెడ్ బయో మెట్రిక్స్ టన్నెల్ మరియు స్మార్ట్ గేట్ల ద్వారా వెళ్ళవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com