‘విరాట పర్వం’ అంచనాలు పెంచేస్తోందిగా.!
- June 16, 2022
రానా, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘విరాట పర్వం’. ఎప్పుడో రిలీజ్ కావల్సిన ఈ సినిమా రేపు అనగా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రాణం సాయి పల్లవి అని చెప్పొచ్చు. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది.
నక్సల్ బ్యాక్ డ్రాప్ అంటే, అదో సీరియస్ టోన్ మూవీ అనే అభిప్రాయం వుంటుంది. నిజమే, సీరియస్ టోనే కానీ, ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ వేణు ఉడుగుల. తన నిజ జీవితంలో చూసిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించారాయన.
మొదట్లో సాదా సీదాగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు భారీ అంచనాలు నమోదు చేస్తోంది. రానా మెయిన్ లీడ్ హీరో అయినా కానీ, ఇదో హీరోయిన్ సెంట్రిక్ మూవీగా అభివర్ణిస్తుండడం విశేషం. అందుకు కారణం లేకపోలేదు. ఇందులో 8 ఇంపార్టెంట్ రోల్స్ వుండగా, అందులో 5 మెయిన్ లీడ్ రోల్స్ మహిళలే పోషిస్తున్నారట.
ఆ ఐదు మహిళా పాత్రలూ దేనికవే చాలా బలమైన పాత్రలనీ ప్రోమోల ద్వారా కాస్త అటూ ఇటూగా అర్ధమైపోయింది. సినిమాలోనూ ఆ పాత్రలకే ఎక్కువ లీడ్ వుంటుందట. సాయి పల్లవితో పాటు, నివేదా పేతురాజ్, ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనీ వాహబ్, నందితా దాస్ ఆ కీలక పాత్రల్లో మెప్పించనున్నారట.
అలాగే, రానాతో పాటు, నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. మావోయిస్టులు, రాజకీయ నాయకులు వాళ్ల కుట్రలతో పాటు ఓ మర్డర్ మిస్టరీ.. ఈ కథలో ఓ అందమైన లవ్ స్టోరీని జోడించి ‘విరాట పర్వం’ తెరకెక్కించాడు దర్శకుడు వేణు ఉడుగుల. చూడాలి మరి, అనుకున్న విధంగా ‘విరాట పర్వం’ అంచనాలను అందుకుంటుందో లేదో.!
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







