యూఏఈ ప్రయాణ నిషేధాన్ని తనిఖీ చేయడానికి 3 మార్గాలు...
- June 17, 2022
మీరు లేదా మీ కుటుంబంతో కలిసి విదేశీ ప్రయాణ ప్రణాళికలను రూపొందించే ముందు ఆ దేశాల్లోకి ప్రవేశించడానికి అర్హులు అని తెలియజేసే పాస్ పోర్ట్ యొక్క చెల్లుబాటు, వీసా అవసరాలు, ప్రయాణ సలహాలు మరియు స్థానిక చట్టాల అంగీకారం వంటివి తనిఖీ చేసేందుకు యూఏఈ డిజిటల్ ప్రభుత్వం మూడు మార్గాలను గుర్తించింది.
అంతేకాకుండా విమానాశ్రయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రయాణానికి ముందుగానే ఆయా దేశాల్లో మీ మీద ప్రయాణ నిషేధం ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించింది.
ఒక వ్యక్తి యొక్క పూర్వాపరాలను తనిఖీ చేసేందుకు దుబాయ్ పోలీసులు ఆన్లైన్ ఉచిత చార్జీ సేవను అందిస్తున్నారు. దీని ద్వారా యూఏఈ లో నివాసం ఉంటున్న వ్యక్తి ఆర్థిక సంబంధిత కేసుల కారణంగా ఆయా దేశాల్లో ప్రయాణ నిషేధానికి గురయ్యారో లేదో తనిఖీ చేసేందుకు వీలు కలుగుతుంది.ఈ సేవను పొందేందుకు మీరు మీ ఎమిరేట్స్ గుర్తింపు కార్డు యొక్క నంబర్ ను నమోదు చేయాలి.
ఈ సేవను పొందేందుకు దుబాయ్ పోలీస్ వెబ్సైట్ ను సంద్శించండి లేదా Google Play మరియు iTunes ల నుండి దుబాయ్ పోలీస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. తదుపరి సమాచారం కొరకు దుబాయ్ పోలీస్ యెక్క 901 నంబర్ కు కాల్ చెయ్యండి.
అలాగే,అబుధాబిలోని జ్యుడిషియల్ శాఖకు చెందిన ఆన్లైన్ సేవా కేంద్రం "Estafser" ఉంది.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా అబుధాబిలో నివాసం ఉంటున్న వారు తమపై ఏమైనా ఆరోపణలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి లేదా తనిఖీ చేసేందుకు వీలు కల్పిస్తుంది.ఈ సేవను పొందేందుకు సదరు అభ్యర్థి తప్పనిసరిగా అతడు/ఆమె యొక్క ఏకీకృత (unified) నంబర్ ను నమోదు చేయాలి.
మీ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందుగానే విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద మిమ్మల్ని ఆపగలిగే కారణాలు ఏవైనా ఉంటే వాటిని తనిఖీ చేయడం లేదా పరిష్కరించుకోవడం మంచిది.మీకు ఈ సమయంలో సలహాలు అవసరమైతే న్యాయవాదిని లేదా సలహా కోసం మీ ప్రాంతంలోని సమీప ఇమ్మిగ్రేషన్/పోలీసు కార్యాలయాలను సంప్రదించవచ్చు.
పాస్ పోర్ట్ యొక్క మరియు కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా అనుమతించే ఈ పాస్ పోర్ట్ యొక్క చెల్లుబాటును తనిఖీ చేయాలని సూచించబడింది.ఈ పాస్ పోర్ట్ లేని ప్రయాణికులను ఆయా దేశాలు అనుమతించవు.
యూఏఈ పౌరులు తమ పాస్ పోర్ట్ ల యొక్క చెల్లుబాటును ఎమిరెట్స్ లోని సంబంధిత జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు విదేశాంగ వ్యవహారాల ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.
యూఏఈ లోని ప్రవాసి నివాసితులు తమ పాస్ పోర్ట్ చెల్లుబాటు, జారీ మరియు పునరుద్ధరణ కోసం ఇక్కడి వారి దేశాల రాయబార మరియు కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించవచ్చు.
విదేశాలకు వెళ్ళడానికి సంబంధించిన ఇతరత్రా సమాచారం కొరకు ప్రయాణికులు విదేశీ వ్యవహారాలు మరియు అంత్జాతీయ సహకార మంత్రిత్వశాఖ ను లేదా వారి కాల్ సెంటర్ (80044444) ద్వారా సంప్రదించవచ్చు.
విదేశాలకు వెళ్ళలనుకునే పౌరులు మరియు నివాసితులు వీసా నిబంధనలు, దరఖాస్తు విధానాలు మరియు సంబంధిత సమాచరాన్ని తనిఖీ చేయడానికి యూఏఈ లోని గమ్యస్థాన దేశం విదేశాంగ కేంద్రాన్ని సంప్రదించాలి.
ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు వీసా దరఖాస్తులను స్వీకరించే వ్యవహారాన్ని VFS గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించాయి.
సాధారణంగా యూఏఈ పౌరులు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా అనేక దేశాలకు ప్రయాణించవచ్చు.అందువల్ల ఎమీరాటీలు వీసా కోసం దరఖాస్తు చేయడం నుండి మినహాయించబడ్డరా లేదా వారి ప్రయాణానికి ముందు వీసా కావాలా లేదా వారు వచ్చిన తర్వాత కూడా దాన్ని పొందవచ్చు అని ముందుగానే చెక్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







