'తెలుగు తరంగిణి-రాస్ అల్ ఖైమా' ఆధ్వర్యం లోదుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు
- April 09, 2016
తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు.
ప్రముఖ పంచాజ్గకర్త శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు పంచాజ్గ పఠనం చేయగా శ్రీ ధర్మరాజు గారు ఆధ్యాత్మిక సందేసం ఇచ్చారు.
అనంతరం జరిగిన సాంస్క్రుతిక కార్యక్రమాలలో ప్రముఖ వర్ధమాన సినీ నేపధ్య గాయకులు దామిని భట్ల (బాహుబలి ఫేం) మరియు డా. అరుణ్ కౌండిన్య (బోల్ బేబి బోల్, సోగ్గాడే చిన్నినాయనా ఫేం) ల పాటలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. చిన్నారుల భరతనాట్యం మరియు సినిమా నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి
యు.ఎ.ఇ లోని సుమారు 1000 మంది తెలుగువారు ఉగాది పచ్చడి, విందు భోజనం, ఆటలు, పాటలు, కోలాటం, మిమిక్రి ఇతర వినోద కార్యక్రమాలతో నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆహ్వన పలికారు.
తెలుగు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ న్యాయవాది శ్రీమతి అనురాధ ఒబ్బిలిసెట్టి గారిని తెలుగు తరంగిణీ వారి ప్రధమ ఉగాది పురస్కారం "ప్రవాసి తెలుగు మిత్ర" తో సత్కరించారు.శ్రీ మతి అనురాధ ఒబ్బిలిసెట్టి గారు తెలుగు పాటశాలని ప్రారంభించారు.
శ్రీ వడ్డిపర్తి పద్మాకర్ గారు, బ్రహ్మశ్రీ డా. కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు మరియు హిస్ హోలినెస్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గల్ఫ్ లోని తెలుగు వారిని ప్రత్యేకించి తెలుగు తరంగిణి సభ్యులను ఉద్దేసించి పంపించిన వీడియో సందేశాలు ముఖ్య ఆకర్షనలుగా నిలిచాయి.
అధ్యక్షులు సురేష్ ఆర్ధ్వర్యంలో తెలుగు తరంగిణి సభ్యులు శ్రీనివాస్, రవిశంకర్, వెంకి, హేమంత్, వెంకట్, వేణు, వీర, వంశి, శివానంద్, సైదా, ప్రసాద్, ప్రవీణ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. సుజన్, మైథిలి ఏంకర్లుగా వ్యవహరించారు. శ్రీ గోపిక్రిష్ణ గారు, శ్రీ సుదర్శన్ గారు బహుమతి ప్రధానం చేసారు
డా. ఇబ్రహీం హస్సన్ అల్ముల్ల తెలుగు తరంగిణి ఉగాది ఉత్సవాలకు విచ్చేసి తమ శుభభినందనలు తెలియ చేసారు
రస్ అల్ ఖైమాలో జరిగిన ఈ కార్యక్రమానికి మా గల్ఫ్ డాట్ కామ్ మీడియా సహకారం అందించింది.















తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







