అయ్యో.! సాయి పల్లవి ఎందుకలా చేసింది. అనవసరంగా కెలుక్కుంది.!
- June 17, 2022
హీరోయిన్ల యందు సాయి పల్లవి వేరయా.. అంటే అతిశయోక్తి అనిపించదు. ఎందుకంటే, ఆమె నడత, నడక, మాట.. అంతా సమ్‌థింగ్ డిఫరెంట్. అందుకే సాయి పల్లవి అంటే, అందరికీ ప్రత్యేకమైన అభిమానం వుంటుంది.
అయితే, ఆ అభిమానాన్ని సాయి పల్లవి కోల్పోయేలా కనిపిస్తోంది. తాజాగా ‘విరాట పర్వం’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్య్వూలో సాయి పల్లవి స్పందించింది. మతం పేరు చెప్పి, కశ్మీర్‌లోని హిందూ పండిట్లను హింసకు గురి చేయడం చాలా దారుణం, దుర్మార్గం అని సాయి పల్లవి ఆవేదన వ్యక్తం చేసింది.
గో సంరక్షణ పేరు చెప్పి, అన్యాయంగా గోవుల్ని తరలిస్తున్న ఓ ముశ్లిం వ్యక్తిని అడ్డగించి అతనిపై దాడి చేయడం కూడా హింసే అవుతుందని అది ఎంత మాత్రమూ సబబు కాదని, ఈ సందర్భంగా సాయి పల్లవి స్పందించింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయ్.
అక్కడ కశ్మీర్‌లోని హిందూ పండిట్లపై జరిగే హింసకీ, ఇక్కడ గో సంరక్షకుల ఇష్యూకి ఎందుకు లింకు పెడతావంటూ, సాయి పల్లవిపై ఒకింత గుస్సా అవుతున్నారు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల విషయంలో రెస్పాండ్ అయ్యేటప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అనవసరంగా అత్యుత్సాహం చూపించి, సాయి పల్లవి ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్లయ్యింది.. అంటూ ఆమె అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ‘విరాట పర్వం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రానాకి జంటగా ఈ సినిమాలో సాయి పల్లవి నటించింది. నవీన్ చంద్ర, ప్రియమణి, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







