ప్రబాస్‌ని మారుతి అలా మార్చేస్తాడా.?
- June 17, 2022
మారుతి డైరెక్షన్లో ప్రబాస్ ఓ సినిమా చేయాల్సి వుంది. కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కాన్సెప్టులో మారుతి సినిమాలుంటాయి. తన సినిమాల్లో హీరోని చాలా ఎనర్జిటిక్‌గా ఫన్నీగా చూపిస్తుంటాడు. అదే మారుతి సక్సెస్ ఫార్ములా. మరి డార్లింగ్ పరిస్థితేంటీ.?
‘బాహుబలి’ సినిమాకి ముందు, బాహుబలి సినిమాకి తర్వాత.. అనేలా మారిపోయింది ప్రబాస్ రేంజ్, స్టార్డమ్, ఆయన సినిమాల ఎంపిక కూడా. అలాంటిది, మారుతి సినిమాల రేంజ్‌కి ప్రబాస్ స్టార్డమ్ రేంజ్ అందుకుంటుందా.? అసలు ఈ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేదేనా.?
బాహుబలికి ముందు ‘బుజ్జిగాడు’, డార్లింగ్’ , ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తదితర సినిమాల్లో ప్రబాస్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా కనిపించేవాడు. కానీ, ఇప్పుడు.. పక్కా యాక్షన్ హీరోలా ట్రాన్స్ఫామ్ అయిపోయాడు ప్రబాస్. అలా అని ప్రబాస్లోని సెన్సాఫ్ హ్యూమర్ ఏమీ తగ్గలేదనుకోండి.
ప్రస్తుతం ప్రబాస్ చేస్తున్న సినిమాలు ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అన్నీ సీరియస్ టోన్‌లోనే వుండబోతున్నాయి. అలాంటిది మారుతి తన సినిమా కోసం ప్రబాస్‌ని మేకోవర్ చేయగలడా.? అనే అనుమానాలు ప్రబాస్ అభిమానుల్లో తలెత్తుతున్నాయ్.
కానీ, మారుతి మాత్రం ప్రబాస్‌తో ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తాను.. అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఇదిలా వుంటే, మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ మూవీ జూలై 1 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా ఈ సినిమా రూపొందింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







