శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

- June 20, 2022 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది.రూ.53.77ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి EK526 విమానం ద్వారా వచ్చిన ఓ ప్ర‌యాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు..శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com