మరో 200 విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిరిండియా
- June 20, 2022
న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా మరో 200కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది.వాటిల్లో 70శాతం విమానాలు సన్నని బాడీతో ఉండే ఎయిర్ క్రాఫ్ట్‌లను మాత్రమే తీసుకోవాలని ఏవియేషన్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఎయిర్‌బస్‌కు చెందిన A350 వైడ్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు కోసం సన్నగా ఉండే బాడీ విమానాల కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎయిర్‌బస్ A350 వంటి విశాలమైన విమానంలో పెద్ద ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇండియా-యూఎస్ మార్గాల వంటి ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.
ఎయిరిండియా 2006 నుండి 111 విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇచ్చినప్పటి నుండి ఒక్క విమానం కూడా కొనుగోలు చేయలేదు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ మ్యాన్యుఫాక్చరర్ బోయింగ్ విమానాలు 68, యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ 43కు కావాలని అడిగారు.
జనవరి 27న టాటా గ్రూప్ ఎయిరిండియా చేతిలో తీసుకున్న తర్వాత.. గతేడాది అక్టోబరు 8న ఎయిర్‌లైన్‌కు సంబంధించిన బిడ్‌ను విజయవంతంగా ముగించింది ఎయిరిండియా.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 78వ వార్షిక సమావేశం సందర్భంగా, ఎయిరిండియా 200 కొత్త విమానాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
వెడల్పుగా ఉండే విమానాల కంటే ఇరుకైన శరీర విమానాల వాటా 70:30గా ఉంటుంది. ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్ లేదా బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఇరుకైన విమానాన్ని కొనుగోలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







