'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు..
- April 10, 2016
'సరైనోడు' చిత్రం ఆడియో విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరగనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడియో విజయోత్సవం ఆదివారం ఆర్కె బీచ్ రోడ్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను బోయపాటి శ్రీను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు. ఈ చిత్రంలో అర్జున్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతమందించారు. ఈ నెలలో సరైనోడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







