దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016
- April 10, 2016
ఎఫ్‌బిబి ఫెమినా మిస్ ఇండియా తుది పోటీలు శనివారం రాత్రి ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఫైనల్‌కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో దిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్ ఇండియా వరల్డ్- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షారుక్ ఖాన్ విజేత పేరు ప్రకటించారు. బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్‌గా నిలవగా, లఖ్‌నవూకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్‌గా నిలిచింది.ఈ సందర్భంగా 'ఫ్యాన్' చిత్రంలోని జబ్రా పాటకు నృత్యం చేసి షారుఖ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, యామీ గౌతమ్, అర్జున్‌కపూర్, కబీర్ ఖాన్, అమీ జాక్సన్, 2015 మిస్ వరల్డ్ మిరేయా లలాగున, టెన్నిస్ స్టార్ సానియామీర్జా, దర్శక నిర్మాత ఏక్తాకపూర్, డిజైనర్లు మనీశ్ మల్హోత్ర, షేన్ పీకాక్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. దర్శకుడు కరణ్‌జోహార్, మనీశ్ పాల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్నారు. వరుణ్‌ధావన్, షాహిద్‌కపూర్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ నృత్య ప్రదర్శనలతో వీక్షకులను ఉర్రూతలూగించారు. పోటీదారుల దుస్తులను అంజు మోదీ, నమత్ర జోషిపుర, ఫాల్గుణి, షేన్ పీకాక్‌లు డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







