కైతలాపూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

- June 21, 2022 , by Maagulf
కైతలాపూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ వల్ల కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య ప్రయాణం సాఫీగా సాగనుంది. బాలానగర్ వైపు నుంచి వచ్చే వారికి ఈ ఫ్లైఓవర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల జేఎన్టీయూ, మలేషియా టౌన్ షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కాగా, సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com