అక్కినేని ఫ్యాన్స్‌కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన సామ్.!

- June 21, 2022 , by Maagulf
అక్కినేని ఫ్యాన్స్‌కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన సామ్.!

అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయాకా సమంత కెరీర్ పరంగా చాలా స్పీడుగా వున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూతో అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకుని వేర్వేరు జీవితాల్లో తమ ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు ఈ జంట.

అయితే, సమంతతో విడాకుల అనంతరం చైతూ మరో హీరోయిన్‌తో లవ్‌లో పడ్డాడనీ, డేటింగ్ వరకూ కూడా వెళ్లాడన్న పుకార్లు గత కొంత కాలంగా షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లకు సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

కానీ, తాజాగా సమంత రెస్పాండ్ అయ్యింది. సమంత రెస్పాండ్ అవ్వడానికి కారణం కూడా లేకపోలేదు. ఈ పుకార్ల వెనుక సమంత పీఆర్ టీమ్ వుందనేది అక్కినేని అభిమానుల ఆరోపణ. అందుకే ఎట్టకేలకు తాజాగా సమంత ఈ పుకార్లపై తన ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యింది.
‘అమ్మాయిలపై పుకార్లు వస్తే, నిజం.. కానీ అబ్బాయిలపై పుకార్లు వస్తే, అది అమ్మాయిలు చేయించినట్లేనా.? మీరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ముందుకు వెళ్లిపోతున్నారు. అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. మీరు కూడా మీ మీ పనులు, కుటుంబం మీద ఫోకస్ పెడితే మంచిది.. ’ అంటూ సమంత స్పందించింది.

అవును, చైతూతో పోల్చితే, సమంత కెరీర్‌లో చాలా ముందుంది. వరుస అవకాశాలతో తగ్గేదే లే.. అనేట్లు జెట్ స్పీడుతో దూసుకెళ్లిపోతోంది. తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’ సినిమాలతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సమంత కెరీర్‌కి ఇప్పట్లో ఢోకా లేదు.

అలాగని చైతూ కూడా తక్కువేం కాదనుకోండి. ప్రస్తుతం తెలుగులో ‘థాంక్యూ’ సినిమాతో పాటు, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్‌లో మొదటి అడుగులు వేశాడు చైతూ. అలాగే ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడు చైతూ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com