హైదరాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- June 21, 2022_1655802416.jpg)
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్యాసింజర్ టెర్మినల్ భవనం తూర్పు భాగంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విమానాశ్రయ ఉద్యోగులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, రక్ష సిబ్బంది పాల్గొన్నారు. సుమారు గంట పాటు ఈ యోగా కార్యక్రమం కొనసాగింది. జేపీ యోగా వెల్ నెస్ కన్సల్టింగ్ కు చెందిన యోగా శిక్షకుడు జయప్రకాశ్ నంబూరు పర్యవేక్షణలో దీనిని నిర్వహించారు.ఆసక్తి కలిగిన కొందరు ప్రయాణికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రాణాయామం, వృక్షాసనం, భుజంగాసనం, శీర్షాసనం వంటి వివిధ ఆసనాలను ప్రదర్శించారు.
యోగా ఒక సుస్థిర జీవన విధానాన్ని బోధిస్తుంది.నేడు ప్రపంచమంతటా శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగాను అనుసరిస్తున్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమ ఉద్యోగులు వివిధ యోగా కోర్సులు, ఆన్‌లైన్ సెషన్‌లు నిర్వహిస్తుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినాన్ని గుర్తిస్తోంది. మొదటి అంతర్జాతీయ యోగా దినాన్ని జూన్ 21 2015న జరుపుకున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..