వెంకయ్య నాయుడితో పెద్దల భేటీ..సర్వత్రా ఉత్కంఠ..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ?

- June 21, 2022 , by Maagulf
వెంకయ్య నాయుడితో పెద్దల భేటీ..సర్వత్రా ఉత్కంఠ..రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ?

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనన్న వేళ… ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిశారు.

ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వారి మధ్య సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. నేటి రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగనుంది.

నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైనే వెంకయ్య నాయుడితో జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నిలుస్తారా? లేదా ఉప రాష్ట్రపతిగా కొనసాగుతారా? అనే అంశాలపై వెంకయ్యతో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టులో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com