టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్..
- June 21, 2022
హైదరాబాద్: టాలీవుడ్లో సమ్మె సరైన్ మోగనుంది.కరోనా ప్రభావంతో గతకొంత కాలంగా తమ జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, సినీ కార్మికులు నిరసనకు దిగుతున్నారు.ఈ నెల 22 నుంచి అన్ని రకాల షూటింగ్‌లకు సినీ కార్మికులు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు.
ఈ నెల 22న ఫిలిం ఫెడరేషన్ ముట్టడికి 24 విభాలకు చెందిన సినీ కార్మికులు పిలుపునిచ్చారు. ఫిలిం ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది.ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. ఇప్పటికైనా తమ గోడును సినీ పెద్దలు వినిపించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. తక్షణమే తమ వేతనాలు పెంచి, తమను ఆదుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాత మండలి సినీ కార్మికుల వేతనాల పెంపుపై స్పందించడం లేదని.. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘ నాయకులతో చర్చిస్తున్నామని.. రేపటి నుండి షూటింగ్‌ల నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రతి రెండేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు.మరి సినీ కార్మికుల డిమాండ్‌కు నిర్మాత మండలి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.ఒకవేళ వారి దగ్గర్నుండి సరైన సమాధానం రాకపోతే, సమ్మె సైరెన్ మోగడం తథ్యం అని అంటున్నారు సినీ కార్మికులు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







