వేసవిలో జరిగే కార్ల అగ్నిప్రమాదాలు గురించి హెచ్చరించిన బహ్రెయిన్ ప్రభుత్వం

- June 22, 2022 , by Maagulf
వేసవిలో జరిగే కార్ల అగ్నిప్రమాదాలు గురించి హెచ్చరించిన బహ్రెయిన్ ప్రభుత్వం

బహ్రెయిన్: పశ్చిమ రిఫా లోని అల్ హజ్జియాత్ ప్రాంతంలో కార్లలో జరిగిన అగ్నిప్రమాదంలో భాగంగా మంటలను అదుపు చేసేందుకు సంభందిత శాఖలకు చెందిన 16 మంది సిబ్బంది మరియు నాలుగు సాయుధ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి అని అంతర్గత మంత్రిత్వశాఖ సామాజిక మధ్యమాల ద్వారా తెలియజేసింది. 

అగ్నిప్రమాదం జరగడానికి కార్ల నిర్వహణా లోపాలు ముఖ్య కారణం అని అధికారులు పేర్కొన్నారు.ఈ సంఘటతో అప్రమత్తమైన బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.వేసవిలో ఎండ ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి కనుక కార్లు లేదా ఇతరత్రా వాహనాల నిర్వహణా లోపాలు కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com