ఆన్లైన్ లో వాహనాల యాజమాన్య వివరాలు
- June 23, 2022కువైట్ సిటీ: వాహనాలకు యాజమాన్యనాన్ని ధృవీకరించే అధికారిక పత్రాలన్ని ఇక నుండి ఆన్లైన్ లో పొందుపరచబోతున్నట్లు ట్రాఫిక్ కార్యకలాపాల అంతర్గత మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ జమాల్ అల్ సయేఘ్ తెలియజేశారు. ఇందు కోసం వాణిజ్య , బీమా పరిశ్రమల మంత్రిత్వశాఖ మరియు ఇన్ఫర్మేన్ డిపార్ట్మెంట్ లతో కలిసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అల్ సయేఘ్ మాట్లాడుతూ...వాహనాలకు సంబంధించిన ఏటువంటి అధికారిక పత్రాలనైన ఆన్లైన్ ద్వారా వినియోగదారులు పొందవచ్చు. అంతేకాకుండా వాహన బీమా కంపెనీలకు మరియు బీమా పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. అలాగే ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే గుర్తింపు దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారాల మీద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం