దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
- June 23, 2022
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో 62 ఏళ్ల ఓ భారత వ్యక్తికి అదృష్టం కలిసి రావడంతో జాక్‌పాట్ కొట్టాడు. ఒమన్‌లో ఉండే జాన్ వర్ఘీస్ అనే భారతీయుడు బుధవారం దుబాయ్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా లో ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 392లో భాగంగా అతడు మే 29న ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 09827కు ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా, వర్ఘీస్ గత ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా ర్యాఫిల్ లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. కేరళ రాష్ట్రానికి చెందిన అతడు 35 ఏళ్ల నుంచి అరబ్ దేశాల్లోనే ఉంటున్నాడు. ప్రస్తుతం మస్కట్‌లోని పాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనే కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కలలో కూడా ఇంత భారీ మొత్తం గెలుస్తానని అనుకోలేదని వర్ఘీస్ పేర్కొన్నాడు. ఈ నగదులో కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మరికొంత భాగాన్ని తన భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు వర్ఘీస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.కాగా, 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్లో ఇప్పటి వరకు మొత్తం 192 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. ఇందులో వర్ఘీస్ 192వ ఇండియన్.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







