విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి పవన్ కళ్యాణ్ క్లాప్..
- June 23, 2022
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే వచ్చిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో ఆకట్టుకున్నాడు.
కెరీర్ ప్రారంభం నుంచి కాస్త వెరైటీ కథలతో సినిమాలు చేస్తూ వస్తున్న విశ్వక్ బాగానే మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం ప్రారంభమయింది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరవడం విశేషం.
విశ్వక్ సేన్ హీరోగా సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈరోజు చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం.
శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజ కోన, లిరిసిస్ట్‌గా చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్‌గా బాలమురుగన్ వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







