తెలంగాణ కరోనా అప్డేట్
- June 24, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది.కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.తెలంగాణలో వరుసగా నాలుగో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు, గురువారం 494 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 493గా ఉంది. కొత్త కేసులు 500లకు చేరువ కావడం టెన్షన్ పెట్టిస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 29వేల 084 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 493 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 366 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 98వేల 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 692 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే (3,048) 3వేల 322కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 28వేల 865 కరోనా టెస్టులు చేయగా.. 494 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







