అమెరికాలో జస్టిస్ ఎన్.వి.రమణ కోసం ఎన్నారైల 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
- June 25, 2022
అమెరికా: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై ఘనంగా సన్మానించాయి. శుక్రవారం(జూన్ 24న) రాత్రి 8.00 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరంలోని మిరాజ్ బాంక్యేట్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. 'మీట్ అండ్ గ్రీట్' పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. అన్ని తెలుగు సంఘాలు ఒకే వేదిక మీద నుంచి తెలుగు జాతి ముద్దుబిడ్డ నూతలపాటి వెంకట రమణను సన్మానించడం ద్వారా 'మీట్ అండ్ గ్రీట్' అనేది అరుదైన కార్యక్రమంగా నిలిచిపోయింది. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల్లో తానూ ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు చెప్పారు. మాతృభాషలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







