ఈ-పాస్ పోర్టులను అందుబాటులోకి తీసుకురానున్న భారత్

- June 25, 2022 , by Maagulf
ఈ-పాస్ పోర్టులను అందుబాటులోకి తీసుకురానున్న భారత్

న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు మరియు గుర్తింపు దొంగతనం నుండి దేశ పౌరులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ- పాస్ పోర్ట్ ను రూపొందించడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ పేర్కొన్నారు. 

పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా జై శంకర్ మాట్లాడుతూ భారత దేశ ప్రయోజనాల కోసం మరియు దేశ పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఈ సందర్బంగా పేర్కొన్నారు. 

విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (psp) యొక్క నూతన వెర్షన్ psp 2.0 ద్వారా దేశ పౌరులకు మెరుగైన పాస్ పోర్ట్ సేవలను అందించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి మంత్రిత్వశాఖ శ్రీకారం చుట్టింది అని శంకర్ పేర్కొన్నారు. 

నూతన వ్యవస్థ ప్రామాణికమైన మరియు సరళీకృత ప్రక్రియల ద్వారా నిర్దిష్టమైన సేవలను అందించేందుకు అధునాతన సాంకేతికను ఉపయోగించడం జరుగుతుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు. 

పేపర్ రహిత డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి పాస్ పోర్ట్ సేవా వ్యవస్థను డిజి లాకర్ వ్యవస్థతో అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. తపాలా శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా 428 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలను (popsk) అనుసంధానించే ప్రక్రియలను చేపట్టడం ద్వారా సులభంగానే పౌరులు పాస్ పోర్ట్ ను స్వయంగా తమ ఇంటి వద్దకు చేరేలా ఉపయోగపడింది.

అలాగే విదేశాల్లోని 178 భారత రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్ లలో పాస్ పోర్ట్ జారీ వ్యవస్థలను విజయవంతంగా ఏకీకృతం చేయడం జరిగిందని ఆయన అన్నారు. కరోనా సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మెరుగ్గా పనిచేసిందని పేర్కొంటునే సగటు నెల వారీగా దేశవ్యాప్తంగా 9,00,000 మరియు అదనంగా 4,50,000 పాస్ పోర్ట్ దరఖాస్తులు మంజూరు చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com