భారత్ కరోనా అప్డేట్

- June 26, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్త‌గా 11,739 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 98.58 శాతంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 10,917 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,27,72,398కి చేరింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా, వారాంత‌పు పాజిటివిటీ రేటు 3.25 శాతంగా ఉంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 86.07 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వివ‌రించింది. గ‌త 24 గంట‌ల్లో 4,53,940 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం
197.08 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించిన‌ట్లు కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ వివ‌రించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com