సెల్ ఫోన్ కంపెనీపై మంత్రిత్వ శాఖ దాడులు
- June 26, 2022
కువైట్: ఫర్వానియాలోని ఒక సెల్ ఫోన్ కంపెనీపై వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు దాడి చేసి విస్తృత శ్రేణిలో ఉపయోగించిన గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఇదివరకే వాడిన సెల్ ఫోన్లను మరమ్మతులు చేసి.. కొత్తవిగా విక్రయించడానికి అసలు పెట్టెల్లో మళ్లీ ప్యాక్ చేసిన వాటిని బారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మోసానికి పాల్పడినట్లు కంపెనీపై అభియోగాలు నమోదు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు చాలా రోజుల పాటు వెరిఫికేషన్, ఫాలో-అప్ తర్వాత కంపెనీ ప్రధాన కార్యాలయంలో దాడులు చేసి పెద్ద మొత్తంలో పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసిన స్టోర్లను గుర్తించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కంపెనీ ఇన్వాయిస్లను పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







