ఏటీఎంలోని వ్యక్తిపై దాడి.. నగదును దోచుకున్న వ్యక్తి అరెస్ట్
- June 26, 2022
బహ్రెయిన్: సనద్‌లోని ఏటీఎం వద్ద 39 ఏళ్ల బహ్రెయిన్ జాతీయుడిపై దాడి చేసి నగదు దోచుకున్న 22 ఏళ్ల ఆఫ్రికన్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ తెలిపింది. ఈ ఘటనలో ఉన్న రెండో నిందితుడి కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో.. క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ వీడియోలో ఏటీఎంలో ఓ వ్యక్తితో బలవంతంగా నగదు డ్రా చేయించి తీసుకోవడం, ఆ తర్వాత అక్కడినుంచి వారు పరారు కావడం కన్పించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







