జ‌ర్మ‌నీలో ప్రధాని మోదీకి ఘ‌న‌స్వాగ‌తం..

- June 26, 2022 , by Maagulf
జ‌ర్మ‌నీలో ప్రధాని మోదీకి ఘ‌న‌స్వాగ‌తం..

జ‌ర్మ‌నీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు.జ‌ర్మ‌నీలోని మ్యునిఖ్ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు అక్క‌డి అధికారులు ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. జ‌ర్మ‌నీలో జరిగే జీ7 సదస్సులో ఆయ‌న పాల్గొంటారు. ఈ స‌ద‌స్సు నేడు, రేపు జ‌ర‌గ‌నుంది. జీ7 దేశాల‌తో పాటు అతిథి దేశాల అధినేత‌లు ఇందులో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై వారు చ‌ర్చిస్తారు.

జ‌ర్మ‌నీలోని మ్యునిఖ్‌లో నేటి సాయంత్రం ఓ కమ్యూనిటీ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌సంగిస్తారు. జ‌ర్మ‌నీ ప‌ర్య‌టన ముగించుకున్న అనంత‌రం ప్ర‌ధాని మోదీ యూఏఈకి వెళ్ళ‌నున్నారు. కాగా, వాతావ‌ర‌ణం, విద్యుత్తు, ఆహార భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, ఉగ్ర‌వాదం, లింగ వివ‌క్ష‌, ప్ర‌జాస్వామ్యం అంశాల‌పై జీ7 స‌ద‌స్సులో చ‌ర్చిస్తామ‌ని ప్ర‌ధాని మోదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మ‌రోవైపు, నేడు జ‌ర్మ‌నీ నుంచే రేడియో కార్యక్రమంలో మ‌న్ కీ బాత్‌లో మోదీ మాట్లాడ‌నున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com