జూన్ 27న సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- June 26, 2022
తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్ లో జూన్ 27న టీటీడీ విడుదల చేయనుంది. మొత్తం 46,470 టిక్కెట్‌లలో, లక్కీ డిప్ సేవా టిక్కెట్లు 8070 ఉన్నాయి. అదేవిధంగా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు ఉన్నాయి.
ఆర్జిత సేవలైన సుప్రబాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్లు లక్కీ డిప్‌లో కేటాయించబడతాయి. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 నుండి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టిక్కెట్‌ల నిర్ధారణ చేయబడుతుంది.
కేటాయించిన టిక్కెట్ల జాబితా జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్ మరియు ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. టికెట్లు పొందిన గృహస్తులు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయించబడుతుంది. భక్తులు తమ సేవా టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ మార్గదర్శకాలను గమనించి పొందాలని టిటిడి కోరుతున్నది.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







