పెను ప్రమాదం నుండి బయటపడ్డ సీఎం యోగి
- June 26, 2022
ఉత్తర్ ప్రదేశ్: యూపీ సీఎం యోగి పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు.ఆదివారం ఆయన వారాణాసి నుంచి లఖ్‌నవూకు వెళుతుండగా ఓ పక్షి హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకునే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్రాజ్ శర్మ తెలిపారు. ల్యాండ్ చేసిన అనంతరం యోగి సర్కూట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత బబత్పుర్ విమానాశ్రయం నుంచి విమాన మార్గంలో లఖ్‌నవూ బయలుదేరారు.
కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారాణాసి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేసిన యోగి.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం అభివృద్ధి పనులను పర్యవేక్షించి 9 గంటలకు లఖ్‌నవూకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







