ప్రమాదాల్లో 5 ఏళ్లలో 2,500 మంది మృత్యువాత

- June 27, 2022 , by Maagulf
ప్రమాదాల్లో 5 ఏళ్లలో 2,500 మంది మృత్యువాత

కువైట్:  దేశంలో గత ఐదేళ్లలో కారు ప్రమాదాల కారణంగా 2,500 మంది మరణించారని కువైట్ సొసైటీ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ హెడ్ బాదర్ అల్-మతార్ వెల్లడించారు. గత ఏప్రిల్ వరకు రెండేళ్లలో (2021/2022) ప్రమాదాల కారణంగా 711 మంది పౌరులు, నివాసితులు మరణించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ట్రాఫిక్ ప్రమాదాల తీవ్రతకు ఇది అద్దం పడుతుందని, జీవితాలను, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి చర్య తీసుకోవాలని సేఫ్టీ హెడ్ బాదర్ అల్-మతార్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల అధికారుల నేతృత్వంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప ట్రాఫిక్ ప్రమాదాల నిర్మూలన జరగదని, దేశంలోని కొన్ని ట్రాఫిక్ సమస్యలపై పునరాలోచన చేయడంతో పాటు ట్రాఫిక్ అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయడం ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చని ఆయన సూచించారు. రహదారి ట్రాఫిక్ మర్యాదలు, చట్టాలు, నిబంధనలు, నియమాలను పాటించడం.. వంటి వాటికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అల్-మతార్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com