ప్రమాదాల్లో 5 ఏళ్లలో 2,500 మంది మృత్యువాత
- June 27, 2022
కువైట్: దేశంలో గత ఐదేళ్లలో కారు ప్రమాదాల కారణంగా 2,500 మంది మరణించారని కువైట్ సొసైటీ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ హెడ్ బాదర్ అల్-మతార్ వెల్లడించారు. గత ఏప్రిల్ వరకు రెండేళ్లలో (2021/2022) ప్రమాదాల కారణంగా 711 మంది పౌరులు, నివాసితులు మరణించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ట్రాఫిక్ ప్రమాదాల తీవ్రతకు ఇది అద్దం పడుతుందని, జీవితాలను, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి చర్య తీసుకోవాలని సేఫ్టీ హెడ్ బాదర్ అల్-మతార్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల అధికారుల నేతృత్వంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప ట్రాఫిక్ ప్రమాదాల నిర్మూలన జరగదని, దేశంలోని కొన్ని ట్రాఫిక్ సమస్యలపై పునరాలోచన చేయడంతో పాటు ట్రాఫిక్ అవగాహన ప్రచారాలను ముమ్మరం చేయడం ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చని ఆయన సూచించారు. రహదారి ట్రాఫిక్ మర్యాదలు, చట్టాలు, నిబంధనలు, నియమాలను పాటించడం.. వంటి వాటికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అల్-మతార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు