ట్రాఫిక్ ప్రమాదాలను నివారించేందుకు వినూత్న ప్రయత్నం

- June 27, 2022 , by Maagulf
ట్రాఫిక్ ప్రమాదాలను నివారించేందుకు వినూత్న ప్రయత్నం

షార్జా: రహదారి భద్రతను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించేందుకు"అలర్ట్ ట్రైలర్" అనే నూతన ప్రాజెక్ట్ కు షార్జా పోలీసులు శ్రీకారం చుట్టారు.దీన్ని షార్జా పోలీస్ విభాగంలోని ఎమిరాతి బృందం తయారు రూపొందించింది. 

ట్రాఫిక్ ప్రమాదాలు లేదా వాహనాల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అందుకు సంబంధించిన సమాచరాన్ని చేరేవేసే క్రమంలో రోడ్ల వద్ద ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాన్ని ఈ అలెర్ట్ ట్రైలర్ భర్తీ చేస్తుంది. అలాగే, కొన్ని సార్లు అనుకోకుండా వేగంగా వచ్చే వాహనాలను తన సెన్సర్ల ద్వారా పసిగట్టి వాహనదారులను అప్రమత్తం చేస్తుంది.  

ఈ ప్రాజెక్ట్ గురించి షార్జా ట్రాఫిక్ మరియు పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ మహ్మద్ అలై అల్ నక్బి మాట్లాడుతూ ఈ ట్రైలర్ ను పర్యావరణ కాలుష్య రహితంగా, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించబడింది మరియు వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు.అలాగే, ట్రాఫిక్ ప్రమాదాలను నివారించేందుకు పూర్తి స్థాయిలో దోహద పడుతుంది అని పేర్కొన్నారు. 

సౌర విద్యుత్ ద్వారా నడిచే ఈ అలర్ట్ ట్రైలర్ ను షార్జా ట్రాఫిక్ పరిశోధక బృందం కేవలం 7 రోజుల్లోనే రూపొందించారు.శాస్త్రీయ పద్దతుల్లో దీని నిర్మాణం గావించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com