బహ్రెయిన్‌ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు

- April 10, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు

గ్యాస్‌ లీకేజీ కారణంగా ఓ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సివిల్‌ డిఫెన్స్‌ ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. గ్యాస్‌ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమీపంలోని కొన్ని షాపులకు మంటలు వ్యాపించాయి. కొన్ని వాహనాలూ ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. రెస్టారెంట్‌ నిర్వాహకులు పని వేళలు ముగించే ముందు గ్యాస్‌ రెగ్యులేటర్లను విధిగా ఆపివేయాలని, తద్వారా ప్రమాదానాలను నియంత్రించవచ్చని అధికారులు సూచించారు. ఇంట్లో వాడే గ్యాస్‌ సిలెండర్ల విషయంలోనూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని వారు కోరారు. గ్యాస్‌ లీకేజీ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవడం ప్రమాదాల నివారణకు మంచి మార్గమని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com