కమిట్‌మెంట్ పక్కన పెట్టేసి, హరీష్ రూటు మార్చేస్తాడా.?

- June 27, 2022 , by Maagulf
కమిట్‌మెంట్ పక్కన పెట్టేసి, హరీష్ రూటు మార్చేస్తాడా.?

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాపై రూమర్లు ఎంత మాత్రమూ ఆగడం లేదు. ఈ కాంబోలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాపై కుప్పలు తెప్పలుగా వస్తున్న రూమర్లను తనదైన స్టయిల్లో తిప్పి కొడుతున్నా.. కొత్త కొత్తగా గాసిప్పులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే వున్నాయ్.

తాజాగా ఈ సినిమాపై మరో రూమర్ జోరుగా ప్రచారమవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో హరీష్ శంకర్‌తో సినిమా చేయలేడనీ, అందుకు ఇంకా చాలా సమయం హరీష్ వేచి చూడాల్సి వస్తుందనేది ఈ ప్రచారం తాలూకు సారాంశం.

సో, హరీష్ శంకర్ ఇక, పవన్‌తో తన ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి, కొత్త ప్రాజెక్టును సెట్స్ మీదికి తీసుకెళ్లే పనిలో వున్నాడనీ తెలుస్తోంది. అయితే, ఏంటా కొత్త ప్రాజెక్ట్.? అంటే, యంగ్ హీరో రామ్ పోతినేనికి అప్పుడెప్పుడో హరీష్ ఓ కథను నెరేట్ చేశాడట. హరీష్‌తో సినిమాకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు, తన సొంత బ్యానర్ అయిన స్రవంతి క్రియేషన్స్‌పైనే ఈ సినిమా రూపొందిస్తానని హరీష్‌కి మాటిచ్చాడట కూడా. ఆ మాట ప్రకారం, ఇప్పుడు రామ్, హరీష్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లిపోనుందనీ ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, రామ్ ప్రస్తుతం ‘ది వారియర్’ సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా వున్నాడు. ఆ తర్వాత బోయపాటి శీనుతో ఓ సినిమా చేయాల్సి వుంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి, రామ్ కూడా బోయపాటిని పక్కన పెట్టేసి, హరీష్ శంకర్‌‌ని లైన్‌లోకి తెచ్చేస్తాడా.? చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com