'ఎజాదా'ను ప్రారంభించిన దుబాయ్ హెల్త్ అథారిటీ
- June 28, 2022దుబాయ్: ఎమిరేట్‌లో మొట్టమొదటిసారిగా విలువ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ మోడల్ అయిన "EJADAH" కార్యక్రమాన్ని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) ప్రారంభించింది. వాల్యూ-బేస్డ్ హెల్త్ కేర్ మోడల్ రోగులకు సంబంధించిన పనితీరు, ఫలితాల కోసం ఇది పనిచేయనుంది. అలాగే అన్ని వ్యాధులకు చికిత్స ప్రోటోకాల్‌లకు సంబంధించి వైద్యులందరూ అనుసరించాల్సిన ఫ్రేమ్‌వర్క్, మార్గదర్శకాలతో హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్లకు సహాయంగా నిలుస్తుందని DHA డైరెక్టర్ జనరల్ అవద్ సెఘాయెర్ అల్ కేత్బీ ఈవెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య రంగం అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి విధానాలు, నిబంధనలను అమలు చేస్తోందన్నారు. దుబాయ్‌లో ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ఎమిరేట్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా మారేందుకు ఇది దోహదపడుతుందన్నారు. EJADAH ద్వారా బీమా చెల్లింపుదారులు, ప్రొవైడర్లు ఫ్రేమ్‌వర్క్, KPIలను అర్థం చేసుకోవడానికి శిక్షణ పొందుతారన్నారు. ఇది వేగవంతమైన మెడికల్ క్లెయిమ్ ఆమోదాలకు సాయంగా ఉంటుందని, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల వృధాను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల