నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- June 28, 2022తెలంగాణ: భారత్ లోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2.. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది.
అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత విశాలమైన ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక వసతులతో.. టీ హబ్-2ని నిర్మించారు. ఇందులో.. ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. శాండ్విచ్ ఆకారంలో కనిపిస్తూ.. అట్రాక్ట్ చేసేలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో.. ప్రతీది ఓ అద్భుతంగా కనిపిస్తోంది.
ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఐదేళ్లు క్రితం టీ-హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మూడెకరాల్లో.. 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం.. 3 లక్షల 70 వేల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగింది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌గా నిలువబోతోంది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి యూనికార్న్ స్టార్టప్‌లు, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్ కేర్, డెలివరీ వ్యవస్థాపకులతో పాటు సీక్యా క్యాపిటల్, యాక్సిల్, ఎండియా పార్ట్నర్స్ హాజరుకానున్నాయి. అలాగే కలారి క్యాపిటల్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్ర బ్యాంక్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ప్రారంభోత్సవంలో పాల్గొంటాయి. ఈ కొత్త బిల్డింగ్‌లో ఒకేసారి 15 వందలకు పైగా స్టార్టప్‌ల ఏర్పాటుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..